Hyderabad: గణేష్ ఉత్సవాల వేళ అత్తాపూర్ పోలీసుల రౌడీషీటర్ల కౌన్సెలింగ్

Hyderabad: అత్తాపూర్ పీఎస్ పరిధిలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. గణేష్ ఉత్సవాల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటామని హెచ్చరించారు.

Arun Goud, Hyderabad
Published on: 1 Sept 2026 7:19 PM IST
Hyderabad
X

Hyderabad: గణేష్ ఉత్సవాల వేళ అత్తాపూర్ పోలీసుల రౌడీషీటర్ల కౌన్సెలింగ్

హైదరాబాద్: రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈరోజు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "రౌడీ షీటర్లపై నజర్" పేరిట ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని అత్తాపూర్ పోలీసు స్టేషన్ లిమిట్స్‌లో ఉన్న మొత్తం 72 మంది రౌడీ షీటర్లలో 45 మంది ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు కఠిన ఆదేశాలు మరియు సూచనలు జారీ చేయడం జరిగింది.

*ప్రధానాంశాలు & ఆదేశాలు:*

* గణేష్ ఉత్సవాల వేళ ఎలాంటి నేరపూరిత లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

* ఏదైనా అవాంఛనీయ సంఘటనలు లేదా ఆ అనుమానాస్పద సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు.

* రౌడీ షీటర్లు ఎవరైనా ఊరు విడిచి వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సంబంధిత సెక్టార్ ఎస్.ఐ (SI) గారికి ముందస్తు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

* నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ (SHO) ఎ. సీతయ్య గారు, సబ్ ఇన్ స్పెక్టర్లు (SI) శ్రీనివాసులు, జయరాజ్, హెడ్ కానిస్టేబుల్ (HC) కృష్ణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad