Hyderabad: సింగరేణి కాలనీలో హత్యాయత్నం పరిస్థితి విషమం
Hyderabad: హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో హమేర్‌పై కత్తులతో దుండగుల దాడి. పరిస్థితి విషమం. పాత కక్షలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు.
Hyderabad: సింగరేణి కాలనీలో హత్యాయత్నం పరిస్థితి విషమం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. హమేర్ (35) అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
తీవ్రంగా గాయపడిన హమేర్‌ను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
హమేర్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. దాడికి గల పూర్తి కారణాలు ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.




