Hyderabad: ఈవీలకు మారే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సల్టింగ్ సర్వీసెస్

Hyderabad: హైదరాబాద్ టెక్ సంస్థ ‘అజా కన్సల్టింగ్ సర్వీసెస్’ సరికొత్త ఈవీ పాలసీని తెచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 May 2026 4:18 PM IST
Hyderabad
X

Hyderabad: ఈవీలకు మారే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సల్టింగ్ సర్వీసెస్

హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు , హైదరాబాద్‌కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.

ఇటీవల ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్‌ పూలింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని, ప్రజా రవాణా వ్యవస్థను విస్త్రృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారని ఫణిరాజ్ తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చన్నారు.

ప్రధాని విజన్‌కు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలో ‘గ్రీన్ పాలసీ’ /‘ఈవీ పాలసీ’ను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్యోగులు స్వచ్ఛమైన, ఇంధన పొదుపు కలిగిన రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story