Hyderabad: జనగణనలో బీసీ కులాల లెక్కలు తేల్చాలని డిమాండ్

Hyderabad: జనగణనలో బీసీ కులాల లెక్కలు సేకరించాలని తెలంగాణ బీసీ జేఏసీ డిమాండ్. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం.

GIRI, CENTRAL ZONE
Published on: 15 Sept 2026 6:15 PM IST
Hyderabad
X

Hyderabad: జనగణనలో బీసీ కులాల లెక్కలు తేల్చాలని డిమాండ్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో బీసీ కులాల లెక్కలు సేకరించాలని తెలంగాణ బీసీ జేఏసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జనగణనలో బీసీల కులాల వారీగా లెక్కలు తీస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని జేఏసీ నాయకులు విమర్శించారు.

బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా జేఏసీ కో-చైర్మన్ గుజ్జ కృష్ణ నేతృత్వంలో బషీర్‌బాగ్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీగా మారిందని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీలో దేశవ్యాప్తంగా బీసీల కులగణన చేపట్టాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని జనగణనలో బీసీ కులాల వారీగా లెక్కలు సేకరించే అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE