Uppal: చెంగిచెర్లలో తెగబడ్డ దొంగలు.. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మాయం

Uppal: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల చిన్న క్రాంతి కాలనీలో దొంగలు హల్చల్ చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 11 Jun 2026 9:14 PM IST
Uppal
X

Uppal: చెంగిచెర్లలో తెగబడ్డ దొంగలు.. ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ మాయం

Uppal: చెంగిచెర్లలో ఇంటి ముందు పార్క్ చేసిన మోటార్ సైకిల్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలానికి చెందిన తుమ్మలపల్లి పవన్ కుమార్ తన బంధువుల ఇంటికి చెంగిచెర్లలోని చిన్న క్రాంతి కాలనీలో వచ్చాడు.

ఈ నెల 7వ తేదీ సాయంత్రం అతని కుమారుడు TS36F5763 నంబర్ గల హోండా షైన్ మోటార్‌ సైకిల్‌ను ఇంటి ముందు పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూడగా బైక్ కనిపించలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ వాహనం ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story