Hyderabad: ఏడు నెలల పాటు సమరసత సంకల్ప యాత్ర గువ్వల బాలరాజు

Hyderabad: సంత్ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా 7 నెలల పాటు సమరసత సంకల్ప యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించిన బీజేపీ నేతలు గువ్వల బాలరాజు, వేముల అశోక్.

G. Govind, Medchal
Published on: 5 Aug 2026 2:52 PM IST
Hyderabad
X

Hyderabad: ఏడు నెలల పాటు సమరసత సంకల్ప యాత్ర గువ్వల బాలరాజు

హైదరాబాద్: సంత్ రవిదాస్ మహారాజ్ భక్తి భావం, మేదో శక్తి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడతాయి. బీజేపీ ఇలాంటి మహనీయుల చరిత్రను వెలికి తీసి ప్రపంచానికి దేశానికి చాటి చెపుతుంది. సంత్ రవిదాస్ మహారాజ్ ఖ్యాతిని ప్రపంచానికి , దేశానికి చాటి చెప్పడానికి ఏడు నెలల పాటు సమరసత సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నాం.

మేము చెప్పటే ఈ కార్యక్రమానికి బీజేపీ వాళ్ళే కాకుండా సమాజంలో దేశ భక్తి , భక్తి భావం కలిగిన వాళ్ళు ఈ యాత్రలో పాల్గొన్నాలి. జూలై 29 వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని కాశీ లో కలిసవందన్ కార్యక్రమానికి అ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్య నాధ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య పాల్గొన్నారు.

సంత్ శిరోమణి, గురు రవిదాస్ మహరాజ్ చరిత్రను ఈ సమాజానికి అందించేందుకు మనం చొరవ తీసుకుంటే.. సమానత్వం నెలకొల్పడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్. సంత్ శిరోమణి, సంత్ గురు రవిదాస్ మహరాజ్ 650 వ జయంతి ఉత్సవాలను దేశా వ్యాప్తంగా మహా సంకల్పంతో నిర్వహించుకుంటున్నాం.

సమరసత సంకల్ప అభియాన్ నామకరణం చేసి రవిదాస్ మహరాజ్ బోధనలు, వారు దేశానికి చేసిన సేవలు, కార్యక్రమాలని దేశ వ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తాం. ఏడు నెల పాటు జయంతి ఉత్సవాలు జరుగుతాయి. జిల్లా, మండల స్థాయిలో సమరసత సంకల్ప అభియాన్ కార్యక్రమాలు జరుగుతాయి. సంత్ రవిదాస్ మహరాజ్ ని అన్ని వర్గాల ప్రజలు దేవుడిలా భావిస్తారు. సంత్ రవిదాస్ మహరాజ్ అడుగు జాడల్లో బీజేపీ నడుస్తుంది.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story