Hyderabad: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ, బీజేవైఎం నాయకుల అరెస్ట్
Hyderabad: ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు భగ్నం చేసి నాయకులను అరెస్ట్ చేశారు.
Hyderabad: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ, బీజేవైఎం నాయకుల అరెస్ట్
హైదరాబాద్: బిజెపి మరియు బిజెవైయం ఆధ్వర్యంలో 40 లక్షల మంది విద్యార్థులకు 15 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా తలపెడితే ఆ యొక్క ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమని ఈరోజు బిజెపి మరియు బిజెవైయం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా అధ్యక్షులు బిజెపి, బిజెవైయం సౌడ రమేష్ అన్నగారు మరియు హరీష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో యువమోర్చా బిజెపి నాయకులు తరలి వెళ్లడం జరిగింది, ఇందులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తరుణంలో గేట్ల వద్ద పోలీసు పహారాలను ఏర్పాటు చేసి సీఎం చేతగాని ప్రభుత్వ అసమర్థత కూడా నిదర్శనమైనటువంటి పాలన కొనసాగిస్తూ అరెస్టులు చేసి దబీర్పుర పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా హరీష్ గారు మాట్లాడుతూ 40 లక్షల మంది విద్యార్థులు 15వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి రేవంత్ రెడ్డిని గద్దె దించేంతవరకు తగ్గబోదని అదేవిధంగా తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు బలిదానాలతో తెచ్చుకుంటే ఈరోజు అదే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఉద్యమాన్ని చేపట్టడం ఎంతో సిగ్గుచేటని విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి రేవంత్ సర్కారుకు తగిన బుద్ధి చెబుతామని రాబోయే రోజుల్లో మరెన్నో ఉద్యమాలు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చేపడతామని హెచ్చరిస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్.
ఈ కార్యక్రమం లో బిజెవైయం రాష్ట్ర నాయకులు కొలనుపాక శరత్ కుమార్,సోషల్ మీడియా కన్వీనర్ రాజేశ్వర్ రెడ్డి, బిజెవైయం జిల్లా నాయకులు డి.కుమార్ యాదవ్, పులి కపిల్ ఆదిత్య , బిజెవైయం జిల్లా నాయకుడు అఖిల్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఉడుత రంజిత్,అజయ్...




