Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ యాత్ర శిల్పారెడ్డి

Hyderabad: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి.

G. Govind, Medchal
Published on: 4 Aug 2026 9:01 PM IST
Hyderabad
X

Hyderabad: రాష్ట్రవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ యాత్ర శిల్పారెడ్డి

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. స్వాతంత్ర్యం దినోత్సవం పురస్కరించుకుని హార్ ఘర్ తిరంగ యాత్ర నిర్వహిస్తున్నాం.

10 నుంచి 15 వ తేదీ వరకు జిల్లా, మండల స్థాయిలో హార్ ఘర్ తిరంగ ర్యాలీలు నిర్వహిస్తాం. ఆగస్ట్ 10న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేయాలి.

ప్రతి పాఠశాల, కళాశాలలో, ఆటో స్టాండ్స్ వద్ద జాతీయ జెండాలను పంపిణీ చేస్తాం. విద్యార్థులకు జాతీయ జెండా ప్రాముఖ్యతను తెలియజేస్తాం. హార్ ఘర్ తిరంగ యాత్రలో భాగంగా పద్మ అవార్డీలు, ప్రముఖులను కలుస్తాం.

ఆగస్ట్ 14 రోజున హైదరాబాద్ లో 30 వేల మందితో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. జాతీయ జెండా విలువ అందరికీ తెలిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story