Hyderabad: బోడుప్పల్‌లో లోన్ యాప్ కేటుగాళ్ల దారుణం..మార్ఫింగ్ ఫొటోలతో వేధింపులు!
Hyderabad: హైదరాబాద్ బోడుప్పల్‌లో లోన్ యాప్ పేరుతో మహిళపై వేధింపులు. 10వ తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌కు పంపిన కేటుగాళ్లు.
Hyderabad: బోడుప్పల్‌లో లోన్ యాప్ కేటుగాళ్ల దారుణం..మార్ఫింగ్ ఫొటోలతో వేధింపులు!
Hyderabad: లోన్ యాప్ పేరుతో ఓ మహిళను వేధిస్తున్న ఘటన హైదరాబాద్ బోడుప్పల్‌లో చోటుచేసుకుంది. బోడుప్పల్‌లోని రాజలింగం కాలనీకి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. ఆమె బంధువు వర్ధన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడని, తిరిగి చెల్లించలేదని చెబుతూ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా మార్పింగ్‌తో 10 వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె అసభ్యకర ఫొటోలు వాట్సాప్‌కు పంపించారు కేటుగాళ్లు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Next Story




