Hyderabad: హబ్సిగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి నిరసన
Hyderabad: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ హబ్సిగూడలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల భారీ నిరసన.
Hyderabad: హబ్సిగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి నిరసన
హైదరాబాద్: కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను ఎప్పటిలాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హబ్సిగూడ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. సందర్భంగా నేతలు మాట్లాడుతూ
గత ప్రభుత్వం పేద కుటుంబాల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల అమలును హైకోర్టు సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు.
పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న ఈ సంక్షేమ పథకాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Next Story




