Hyderabad: హెచ్‌సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా అస్వస్థత!

Hyderabad: గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) హాస్టళ్లలో నాసిరకం ఆహారం తిని 30 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 20 Nov 2026 8:41 AM IST
Hyderabad
X

Hyderabad: హెచ్‌సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి పైగా అస్వస్థత!

హైదరాబాద్: గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపాయి. మెన్స్ హాస్టల్ ఎం-అనెక్సీ (M-Annexe), ఎన్‌ఆర్‌ఎస్ (NRS) హాస్టళ్లలో నాసిరకం ఆహారం తిని 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున విద్యార్థులకు వాంతులు, విరేచనాలు మొదలవడంతో వారిని వెంటనే యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు.

హాస్టల్ మెస్‌లలో నెలకొన్న అపరిశుభ్రత, నాసిరకం ఆహార సరఫరాపై గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విద్యార్థి సంఘం ప్రతినిధులు ఆరోపించారు. ఇంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనప్పటికీ వైస్-ఛాన్సలర్ గానీ, రిజిస్ట్రార్ గానీ కనీసం స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ సెంటర్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని విద్యార్థి సంఘం తెలిపింది. ఎం-హాస్టల్‌లో తక్షణమే అత్యవసర వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY