Hyderabad: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపణలను తిప్పికొట్టిన కాంగ్రెస్

Hyderabad: కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుందని కాంగ్రెస్ మండిపాటు. మన్నె క్రిశాంక్ ప్రెస్ మీట్ ఆరోపణలను తిప్పికొట్టిన అధికార పార్టీ నాయకులు.

G. Rama Krishna, Hyderabad
Published on: 19 Oct 2026 8:45 PM IST
Hyderabad
X

Hyderabad: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపణలను తిప్పికొట్టిన కాంగ్రెస్

హైదరాబాద్: పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుని, ఫామ్‌హౌస్‌ల పాలన సాగించింది. ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్న అసహనంతోనే మన్నె క్రిశాంక్ రోజుకో డ్రామాతో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముందు మీ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతికి, అక్రమాలకు సమాధానం చెప్పండి. తెలంగాణ భవన్‌లో కొన్ని కాగితాలు పట్టుకుని టీవీల ముందు అరిస్తే అది నిజం అయిపోదు.

మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లండి లేదా దర్యాప్తు సంస్థలకు ఇవ్వండి. అంతేతప్ప రోజూ మీడియా ముందు పబ్లిసిటీ స్టంట్లు చేయడం మీ డెస్పరేషన్‌ను బయటపెడుతోంది. కేంద్రంతో పదేళ్లపాటు లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని, కేసుల నుంచి రక్షణ పొందింది బీఆర్ఎస్ కాదా? ఇప్పుడు సీబీఐ విచారణ అంటూ కబుర్లు చెబితే ప్రజలు ఎవరూ నమ్మరు.

దమ్ముంటే కేసీఆర్ కుటుంబం 2014 నుంచి 2023 వరకు పెంచుకున్న ఆస్తులపై సమగ్ర విచారణకు మీరు సిద్ధమా? మ్యాక్సిబియాన్, మైండ్‌వాల్స్, మెడికవర్ హాస్పిటల్ విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి అల్లుడు సత్యారెడ్డి గారి గురించీ, కూతురు నిమిషారెడ్డి గారి గురించీ మన్నె క్రిశాంక్ పూర్తిగా అర్థం లేని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.

ప్రభుత్వం ఆ సంస్థలకు భూములు గానీ, ఆర్థికంగా ఎలాంటి అక్రమ లబ్ధి చేకూర్చలేదు; అలాంటప్పుడు ఆ సంస్థలను ప్రభుత్వం మీదకు, కుటుంబం మీదకు ఎందుకు లాగుతున్నారు? సీబీఐ విచారణ జరపాలని, సిట్టింగ్ జడ్జితో కమిషన్ వేయాలని క్రిశాంక్ మాట్లాడుతున్నారు.. మరి కాళేశ్వరం కమిషన్ మీద కోర్టుకు వెళ్లింది మీరే కదా, ఇప్పుడు కమిషన్ వేయాలని మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది?

సొంత కూతురు కవిత కల్వకుంట్ల ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేసిన సమయంలోనే కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని స్వయంగా ఆమె ఆరోపించారు, ఆ ఆరోపణలన్నింటికీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీ బీఆర్ఎస్ ఉంది. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, పాలమూరు-రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, మిషన్ భగీరథ నుంచి కాకతీయ వరకు ప్రతి ప్రాజెక్ట్‌లోనూ దోపిడీ జరిగింది.

70 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది మీ బీఆర్ఎస్ పార్టీనే. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లోనే 1500 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి, దేశంలోనే అత్యంత కాస్ట్‌లీ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. 'నమస్తే తెలంగాణ' పేపర్, 'టీ న్యూస్' ఛానెల్, 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు, గచ్చిబౌలిలో 10 ఎకరాల జాగా, ఢిల్లీలో 1200 గజాల్లో 6 ఫ్లోర్ల భారీ బిల్డింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి?

కేసీఆర్ గారికి ఎర్రవల్లిలో ఫామ్‌హౌస్, నందినినగర్‌లో ఇల్లు ఉన్నాయి. కేటీఆర్ గారికి జన్వాడ ఫామ్‌హౌస్, నర్సింగ్‌లో ఇల్లు, 200 గదులు ఉన్న రెండు హోటళ్లు ఉన్నాయి. హరీశ్‌రావు గారికి మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్, రంగనాయకసాగర్‌లో ఫామ్‌హౌస్, నర్సింగ్, గచ్చిబౌలిలో బంగ్లాలు ఉన్నాయి; అసలు అవినీతి చేసింది మీరూ, దోపిడీ చేసింది మీరూ!

దోచుకున్న సంపదను పంచుకునే సమయంలో మీలోనే గొడవలై, చివరికి కవితగారినే పార్టీ నుంచి బయటికి పంపింది మీరే కదా? సోషల్ మీడియాలో హైప్ కోసం, రోజువారీ హెడ్‌లైన్లలో నిలవడం కోసమే క్రిశాంక్ ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు బీఆర్ఎస్‌ను ఎప్పుడో తిరస్కరించారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా మీ మునిగిపోయే నావను ఎవరూ కాపాడలేరు.

ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు సంక్షేమం, ఆరు గ్యారంటీల అమలుతో ముందుకు వెళ్తోంది. మా రేవంత్ రెడ్డి గారి పాలనలో జరుగుతున్న ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పనికిమాలిన బురదజడుపు రాజకీయాలు చేస్తున్నారు

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad