Hyderabad: కమిడి జ్ఞానప్రకాష్ సంస్మరణ సభలో కీర్తిరెడ్డి నివాళి!
Hyderabad: హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కమిడి జ్ఞానప్రకాష్ సంస్మరణ సభ జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నేత జూటూరు కీర్తిరెడ్డి నివాళులర్పించారు.
Hyderabad: కమిడి జ్ఞానప్రకాష్ సంస్మరణ సభలో కీర్తిరెడ్డి నివాళి!
హైదరాబాద్: వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరొందిన జ్ఞానప్రకాష్ వంటి మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమన్నారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. సోమవారం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కమిడి జ్ఞాన ప్రకాష్ (11వ రోజు) సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తిరెడ్డి.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు పలువురు ప్రముఖులు, అధికారులుతో కలిసి జ్ఞానప్రకాష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
అనంతరం కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరొందిన జ్ఞానప్రకాష్ వంటి మంచి మనిషిని మన మధ్యలేకపోవడం బాధాకరమన్నారు. ప్రజాసేవలో ఆయన అందించిన సేవలు, చేసిన కృషి ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. జ్ఞానప్రకాష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్నిప్రసాదించాలని కీర్తిరెడ్డి ఆకాంక్షించారు.




