Hyderabad: హైదరాబాద్‌లో రూ. 2 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం పట్టివేత!

Hyderabad: తార్నాకలో ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడి. రూ. 2 లక్షల విలువైన 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లతో మాజీ సైనికుడి కుమారుడు ఆర్‌. మాధవన్ అరెస్ట్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Aug 2026 5:39 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో రూ. 2 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం పట్టివేత!

Hyderabad: రూ. 2 లక్షల విలువ చేసే డిఫెన్స్ మద్యం పట్టివేత. కర్ణాటక హర్యానా డిఫెన్స్ బాటిల్స్ గా గుర్తింపు. 67 డిఫెన్స్ మద్యం బాటిల్ స్వాధీనం. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఇతర సిబ్బంది కలిసి తార్నాక ప్రాంతంలో ఒక వ్యక్తి వద్ద పది మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ గా గుర్తించి ఆ బాటిల్స్ వివరాలను సేకరించారు. మద్యం బాటిల్లను అమ్మకాలు జరుపుతున్న ఆర్ మాధవన్ మాజీ సైనికుని కొడుకు. హైదరాబాదులో ఉంటూ వివిధ రాష్ట్రాల నుంచి డిఫెన్స్ మద్యం బాటిల్లను తీసుకొని వచ్చి హైదరాబాదులో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. నిందితుడు ఇంట్లో మరో 57 మద్యం బాటిల్లు మొత్తం 67 మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ రూ. 2 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. 100 పేపర్స్, అమృత్, టీచర్స్ ఇతర మద్యం బాటిల్లు ను పరిశీలించగా కర్ణాటక, హర్యానా ప్రాంతాలకు చెందిన డిఫెన్స్ బాటిల్స్ గా ఉన్నట్లు విచారణలో వెల్లడయింది. మద్యం బాటిల్లను అమ్మ కాలు జరుపుతున్న నిందితుడు మాధవన్ సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ దాడిలో ట్రేని ఏఈ ఎస్ చిరంజీవి, హెడ్ కానిస్టేబుల్ అఫ్జల్, కానిస్టేబుల్ శశిధర్ శేఖర్ జంగయ్య లు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story