Hyderabad: సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేయాలి

Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ.

RAJESH,	WEST ZONE
Published on: 22 Oct 2026 8:34 PM IST
Hyderabad
X

Hyderabad: సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేయాలి

హైదరాబాద్: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ హాజరయ్యారు.

హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ముదిరాజ్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ కోరారు.

పట్టభద్రుల ఓటర్లను నేరుగా కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడి ఓటు కీలకమని పేర్కొంటూ, అర్హులైన పట్టభద్రులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని, ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ఓటర్లను చేరుకునే విధానం, ప్రచార కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE