Hyderabad: హైదరాబాద్‌లో వాట్సాప్ గంజాయి ముఠా అరెస్ట్
Hyderabad: వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న ఈగల్ ఎస్పీ గిరిధర్. 14 కేజీల గంజాయి, ఎయిర్‌గన్ సీజ్. నిందితుల అరెస్ట్.
Hyderabad: హైదరాబాద్‌లో వాట్సాప్ గంజాయి ముఠా అరెస్ట్
హైదరాబాద్: వాట్సాప్ గ్రూప్ ద్వారా నగరంలో గాంజా సప్లై జరుగుతున్నట్టు సమాచారం వచ్చింది. బేగం పేట్ ఓల్డ్ ఏయర్ పోర్ట్ వద్ద ఒక అనుమానిత వ్యక్తి ని అదులోకి తీసుకున్నాం. అతని వద్ద 50 గ్రాముల గాంజా దొరికింది. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా కిరణ్,దుర్గా ప్రసాద్ కమలాకర్ అనే నిందితులు ఈ సప్లై వెనుక ఉన్నట్టు తెలిసింది.
బాలానగర రాజీవ్ కాలనీ లో నిందితులు నివాసం ఉంటున్నట్టు సమాచారం అందింది. నార్కోటీమ్స్,మల్కాజ్ గిరి నార్కోటిక్ టీమ్స్ దాడులు చేసాయి. నిందితుడు బొల్లా కిరణ్ ..మల్లేష్ అనే ఇన్ స్పెక్టర్ పైన స్క్రూ డైవర్ తో దాడి చేసాడు. కిరణ్ అనే నిందితుడు నాలుగో ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య డ్రామా ఆడాడు..
దుర్గా ప్రసాద్, కమలాకర్, కిరణ్ లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసాము. స్పాట్ లో 14 కేజీ ల గాంజా సీజ్ చేసాము. ఒక ఎయిర్ గన్ ను సీజ్ చేసాము. వీరంత ఒడిస్సా నుంచి గంజా సప్లై చేస్తున్నారు. ఒడిశా కు చెందిన 5 మందిని అదుపులోకి తీసుకున్నాము.
నిందితులు ప్యాకెట్ ఫోటో తీసుకుని కంజుమర్ కి అందగానే అక్కడి నుంచి పారిపోతారు. కారు, బైక్, మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాము. 2022 నుంచి ఇప్పటివరకు 203 మందికి గాంజా సప్లై చేశారు. 100 మంది ని పరీక్షస్తే 72 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము.
H new, బాలానగర్ పోలీసుల సహకారంతో నిందితులను త్వరగా పట్టుకోగలిగాము. మొత్తం 40 టీములు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. పాజిటివ్ వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.




