Hyderabad: ప్రెస్ క్లబ్‌లో ఘనంగా మట్టి గణేషుడి పూజలు!

Hyderabad: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణనాథునికి ఘనంగా పూజలు; పాల్గొని అన్నప్రసాదం స్వీకరించిన ప్రముఖులు, జర్నలిస్టులు.

RAJESH,	WEST ZONE
Published on: 24 Sept 2026 9:17 AM IST
Hyderabad
X

Hyderabad: ప్రెస్ క్లబ్‌లో ఘనంగా మట్టి గణేషుడి పూజలు!

Hyderabad: సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్లో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణనాథునికి పూజలు నిర్వహించారు. ఇదే సందర్భంగా అన్న ప్రసాదలను అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఏ .రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్స్ ముత్యాల సత్తిబాబు , వనం నాగరాజు, అశోక్ దయ్యాల, అమిత్ బట్టు, ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 మందికి పైగా అన్న ప్రసాదం స్వీకరించారు.

మాజీ మంత్రి దానం నాగేందర్ ,బిజెపి నాయకులు చింతల రామచంద్ర రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆర్టిఏ జాయింట్ కమిషనర్ వెంకటరమణ ఆర్టీవో కృష్ణయ్య ఖైరతాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ లోని గణేష్ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేశారు. గణేష్ లడ్డూ వేలం పాట అనంతరం మట్టి వినాయకు కుడిని వినాయక సాగర్ లో నిమజ్జనం చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE