Hyderabad: ఒడిశా టు నాందేడ్ గంజాయి స్మగ్లింగ్.. హైదరాబాద్‌లో చెక్!
Hyderabad: ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలు మార్గంలో తరలిస్తున్న రూ. 18 లక్షల విలువైన గంజాయిని హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మారేడుపల్లి వద్ద వలపన్ని పట్టుకున్నారు.
Hyderabad: ఒడిశా టు నాందేడ్ గంజాయి స్మగ్లింగ్.. హైదరాబాద్‌లో చెక్!
హైదరాబాద్: ఒరిస్సా బరంపూర్ జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి తీసుకు వెళుతున్న గంజాయిని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మలు సిబ్బందితో కలిసి వలపన్ని పట్టుకున్నారు.
బరంపూర్ జిల్లా నుంచి నాందేడ్ ప్రాంతానికి చెందిన వ్యక్తులకు గంజాయిని అప్పగించడానికి రాహుల్ సేతి (27) అనే వ్యక్తి గంజాయిని రైల్లో తీసుకొని వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉన్న మారేడుపల్లి స్టేషన్లో నాందేడ్ నుంచి వచ్చి తీసుకు వెళ్ళే వ్యక్తులకు కోసం ఎదురుచూస్తున్న సమయములో హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు,ఎస్ఐలు సిబ్బంది కలిసి వలపన్ని పట్టుకున్నారు.
గంజాయిని తీసుకువెళ్లే వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్,,కోటమ్మ ఎస్సైలు శ్రీనివాస్, రూప, భూపాల్ హెడ్ కానిస్టేబుల్ హా ఫీస్ కానిస్టేబుల్ మురళి జంగయ్య శేఖర్ శోభ శశిధర్ లు కలిసి నిందితున్ని పట్టుకున్నారు.
అతని వద్ద బ్యాగులో ఉన్నటువంటి గంజాయి పాకెట్లను బయటికి తీశారు. వాటిని తూకం వేగా 17.4 2 కేజీలుగా ఉన్నట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 18 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని తీసుకువచ్చిన రాహుల్ సేతిని అరెస్ట్ చేసి గంజాయి తో పాటు నిందితుని మారేడుపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.




