Hyderabad: వెంకటేశ్వర నగరంలో ఘనంగా గణేష్ నిమజ్జనం!

Hyderabad: జగద్గిరిగుట్ట: వెంకటేశ్వర నగర్ బస్తీ దవాఖాన వద్ద ముగిసిన వినాయక వేడుకలు; భక్తిశ్రద్ధలతో నిమజ్జనం, రూ.67,000లకు లడ్డూ దక్కించుకున్న నారోజు శ్రీనివాస్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 Sept 2026 10:22 AM IST
Hyderabad
X

Hyderabad: వెంకటేశ్వర నగరంలో ఘనంగా గణేష్ నిమజ్జనం!

Hyderabad: వెంకటేశ్వర నగర్ బస్తీ దవఖాన దగ్గర ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి బుధవారం ముగింపు కార్యక్రమాలను కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, లడ్డూ వేలం, వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. మొదట లడ్డూను సాక్షిత్ గౌడ్ వేలం లో లడ్డు కోసం ప్రయత్నం చేయగా, నారోజు శ్రీనివాస్ రూ.67000 కు, లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.

గణపతి నవరాత్రుల చివరి రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. గణనాథుని ముందు బాజా భజంత్రీల మధ్య మహిళలు యువకులు చిన్నపిల్లలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎర్ర లక్ష్మయ్య,పల్లపు బాబు,రాంబాబు,బీమ్,బొమ్మ శ్రీధర్,బీమ్రాజ్,యాదగిరి,తిమ్మయ, సతీష్,అఖిల్,ప్రసాద్,సాయి,విక్కి,బొట్టు బాబు,రాము,ఎల్లేష్,ఆనంద్, నాని,చందు,అంజి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR