Hyderabad: కల్తీ చేస్తే పీడీ యాక్ట్ ఆహార కల్తీగాళ్లకు సజ్జనర్ హెచ్చరిక
Hyderabad:
Hyderabad: కల్తీ చేస్తే పీడీ యాక్ట్ ఆహార కల్తీగాళ్లకు సజ్జనర్ హెచ్చరిక
హైదరాబాద్: కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఉక్కు పాదం మోపడమే లక్ష్యంగా ఏర్పాటు అయిన హెచ్ పాస్ట్ కూ నేటితో వంద రోజులు పూర్తి.
ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం....100 రోజుల్లో 185 కేసులు నమోదు. 121.87 టన్నుల కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాల స్వాధీనం.
రాజేంద్రనగర్ జోన్‌లో అత్యధికంగా 55 కేసులు నమోదు. గోల్కొండలో 44, సికింద్రాబాద్‌లో 35, చార్మినార్‌లో 21 కేసులు 27 టన్నులకుపైగా కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ సీజ్. కృత్రిమంగా మగ్గబెట్టిన 25.8 టన్నుల పండ్లు స్వాధీనం.
60 టన్నులకుపైగా చికెన్ వ్యర్థాలు పట్టివేత. 15 టన్నుల నాణ్యతలేని చికెన్, మాంసం స్వాధీనం. 9.2 టన్నుల నిల్వ పచ్చళ్లు, 4 టన్నుల కల్తీ కోవా సీజ్..
3.8 టన్నుల నకిలీ టీ పొడి, 3.2 టన్నుల కల్తీ క్రీమ్ స్వాధీనం. 530 కేజీల కల్తీ నెయ్యి, 2.5 టన్నుల కల్తీ పెరుగు పట్టివేత.
1.5 టన్నుల కల్తీ పనీర్, 120 కేజీల నాణ్యతలేని ఫ్రైడ్ చికెన్ సీజ్ మరో 247 కేసులు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ
పనీర్ అవుట్‌లెట్లపై 70, ప్రజల ఫిర్యాదులపై 90 కేసులు హోటళ్లు, బేకరీలు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కఠిన మార్గదర్శకాలు
కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం -సీపీ వీసీ సజ్జనర్.




