Hyderabad: హైదరాబాద్‌లో శ్రవణ సంరక్షణపై ఆసియా-పసిఫిక్ సదస్సు!
Hyderabad: హైదరాబాద్‌లోని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రిలో 2వ ఆసియా-పసిఫిక్ కాక్లియర్ ఇంప్లాంట్ సదస్సు. పలు దేశాల వైద్య నిపుణుల హాజరు, లైవ్ సర్జరీలు.
Hyderabad: హైదరాబాద్‌లో శ్రవణ సంరక్షణపై ఆసియా-పసిఫిక్ సదస్సు!
Hyderabad: హైదరాబాద్‌లోని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ నిర్వహించారు. అడ్వాన్స్‌డ్ బయోనిక్స్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలపై లైవ్ సర్జరీలు, హ్యాండ్స్-ఆన్ శిక్షణ నిర్వహించారు.
దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, వియత్నాం, ఇండోనేషియాతో పాటు భారత్ నలుమూలల నుంచి నిపుణులు హాజరయ్యారు. సంక్లిష్టమైన సర్జరీ పరిస్థితులను ముందుగానే ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆపరేషన్ సమయంలో సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సదస్సు అధ్యక్షుడు డాక్టర్ శ్రీ రావు తెలిపారు.
Next Story




