Tarnaka: తార్నాకలో మత్తు సిరప్‌ల విక్రయం కలకలం ఎక్సైజ్ దాడి

Tarnaka: తార్నాకలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు సిరప్‌లు అమ్ముతున్న మెడికల్ షాప్ యజమానిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసి 50 బాటిళ్లు స్వాధీనం చేసుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Sept 2026 11:24 PM IST
Tarnaka
X

Tarnaka: తార్నాకలో మత్తు సిరప్‌ల విక్రయం కలకలం ఎక్సైజ్ దాడి

తార్నాక: అమ్మడమే నేరం. ఆపై ఎక్కువ ధరకు అమ్మకాలు. డ్రగ్స్ ఎడిక్ట్ వ్యక్తులకు మత్తు కోసం మత్తును కలిగించే సిరప్ లను డాక్టర్ పిక్సెప్షన్ లేకుండా వినియోగదారులకు రూ.200 బదులు రూ.500 తీసుకుంటూ అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్న మెడికల్ యజమాని మెడికల్ హాల్ యజమానిపై ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం c సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు సిబ్బంది కలిసి దాడి చేసి 50 మత్తు కలిగించే 50 బాటిల్లను పట్టుకున్నారు.

తార్నాక నాగార్జున కాలనీలో ఏబీ జెనరిక్ అనే మందుల దుకాణంలో ఈ మత్తు మందు కలిగించే సిరప్ లను అమ్మకాలు జరుపుతున్నారు.

ఈ కేసులో కాజా బషీర్ ఉద్దీన్ ఖాన్ అనే వ్యక్తి మత్తు కలిగించే సిరుకులను డాక్టర్ ప్రేక్షిప్సన్ లేకుండా అమ్మకాలు జరుపుతున్నట్లు అతనిపై కేసు నమోదు చేశారు.

మరో అడుగు ముందుకు వేసిన నిందితుడు అవసరం ఉన్న డ్రగ్ ఎడిక్ట్ వ్యక్తులకు రాపిడో లాంటి సౌకర్యాలను కూడా కల్పిస్తూ రూ 200 సిరప్ కు మరింతగా డిమాండ్ ఎక్కువ తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని నుంచి 50 మత్తుమందు కలిగించే సిరప్ లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్