Hyderabad: మున్సిపల్ కార్మికులకు సెలవులు అమలు చేయాలి జైపాల్ రెడ్డి

Hyderabad: గ్రేటర్ స్పెషల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ కార్మికులకు సెలవులు అమలు చేయాలని కోరుతూ ఎల్బీనగర్ జెడ్సీకి వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నేతలు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 27 July 2026 8:18 PM IST
Hyderabad
X

Hyderabad: మున్సిపల్ కార్మికులకు సెలవులు అమలు చేయాలి జైపాల్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ స్టాప్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మున్సిపల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం మద్దిలేటి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతో కి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మున్సిపల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ మారుశుద్ధ్య కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న సెలవులను అమలు పరచాలన్నారు.

స్పెషల్ కమిషనర్ గారు తేదీ: 19-06-2026 రోజు సర్కులర్ నెంబర్: 1906/LWS/B1/GHMC/2026--256 గ్రేటర్ పరిధిలోని అన్ని కార్పొరేషన్ లోని జోనల్ కమీషనర్, డిప్యూటీ కమిషనర్లకు,15వ క్యాజువల్ ,8 పండగ సెలవులని, మహిళలకు 120 ప్రసూతి కానుపులను అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జోనల్ కమిషనర్ కి వివరించరు.

కమిషనర్ స్పందిస్తూ కార్మికులకు ఇచ్చేటువంటి సెలవులని తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు బి రాములు, సుఖమ్మ, జ్యోతి, కొమురమ్మ, తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story