Hyderabad: ఉస్మానియా వర్సిటీలో జనసేన 'పట్టభద్రుల ఎక్స్ప్రెస్' ప్రారంభం!
Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో జనసేన 'పట్టభద్రుల ఎక్స్ప్రెస్' ప్రారంభం. నిరుద్యోగ, విద్యార్థి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారం.
Hyderabad: ఉస్మానియా వర్సిటీలో జనసేన 'పట్టభద్రుల ఎక్స్ప్రెస్' ప్రారంభం!
హైదరాబాద్: తెలంగాణ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ చేపట్టిన ‘పట్టభద్రుల ఎక్స్ప్రెస్’ వాహనాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభించారు. వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల ఆకాంక్షలు, ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వివిధ వర్గాల సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
తెలంగాణ ఉద్యమంతోపాటు అనేక విద్యార్థి పోరాటాలకు వేదికగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుల ఎక్స్ప్రెస్ను ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. యువత, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే వేదికగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు బండి నరేష్, సంపత్ నాయక్, మిరియాల రామకృష్ణ, కత్తి సైదులు, రాష్ట్ర విద్యార్థి నాయకుడు మహేష్ పెంటల, అధికార ప్రతినిధి తాళ్లూరి కౌశిక్, నాయకులు మొకురాల కృష్ణ, వినోద్ నాయక్, చుక్కా నాని, ఆరణి గౌతమ్, అక్షయ్ రెడ్డి, యద్దనపూడి రాము, విద్యార్థులు పాల్గొన్నారు.




