Serilingampally: గౌలిదొడ్డిలో C&D వ్యర్థాల బదిలీ కేంద్రం ప్రారంభం

Serilingampally: హైదరాబాద్ శేరిలింగంపల్లి గౌలిదొడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన C&D వ్యర్థాల బదిలీ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 17 Aug 2026 9:16 PM IST
Serilingampally
X

Serilingampally: గౌలిదొడ్డిలో C&D వ్యర్థాల బదిలీ కేంద్రం ప్రారంభం

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలోని గౌలిదొడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల (C&D Waste) బదిలీ కేంద్రాన్ని (ట్రాన్స్‌ఫర్ స్టేషన్) రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ (IAS) అధికారికంగా ప్రారంభించారు. 'రీ సస్టైనబిలిటీ' సంస్థ ఆధ్వర్యంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జి. సృజన (IAS), అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ (IAS) తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నగరంలో పెరుగుతున్న సీ అండ్ డీ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి సమర్థవంతంగా పునరుద్ధరించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. రహదారులపై పారబోసే వ్యర్థాలకు అడ్డుకట్ట వేసి, శేరిలింగంపల్లిని పరిశుభ్రమైన, సుస్థిర పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story