Hyderabad: నషా ముక్త్ భారత్ పాదయాత్రలో జూటూరు కీర్తిరెడ్డి సందడి
Hyderabad: హైదరాబాద్ మైత్రీవనంలో కిషన్ రెడ్డి ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర 3వ రోజు పాల్గొన్న బీజేపీ నేత జూటూరు కీర్తిరెడ్డి; డప్పు వాయిస్తూ, కోలాటం ఆడుతూ సందడి.
Hyderabad: నషా ముక్త్ భారత్ పాదయాత్రలో జూటూరు కీర్తిరెడ్డి సందడి
హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో భాగంగా మూడో రోజు మైత్రీవనం వద్ద ఆమె పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డ్రగ్స్‌కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
పాదయాత్రలో డప్పు వాయిస్తూ, స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ కీర్తిరెడ్డి ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించగలమని ఆమె స్పష్టం చేశారు.




