Hyderabad: బండ్లగూడలో వైన్స్‌లోకి దూరి వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు

Hyderabad: బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్‌లో వ్యక్తి దారుణ హత్య. ప్రాణభయంతో వైన్స్‌లోకి పరుగెత్తినా వదలకుండా నరికిన నిందితులు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 Sept 2026 11:18 PM IST
Hyderabad
X

Hyderabad: బండ్లగూడలో వైన్స్‌లోకి దూరి వ్యక్తిని దారుణంగా నరికి చంపిన దుండగులు

హైదరాబాద్: నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడలో దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తిపై కొందరు దుండగులు వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

దుండగులు వెంటపడటంతో ప్రాణభయంతో బాధితుడు బండ్లగూడలోని సుప్రీమ్‌ వైన్స్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అతడిని వదలకుండా వెంటాడిన దుండగులు వైన్స్‌లోనే కత్తులతో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం.

హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి కారులో పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న నాగోల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతడిని హత్య చేసింది ఎవరు? హత్యకు గల కారణం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. బండ్లగూడలో వైన్స్‌లోనే జరిగిన ఈ దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR