Viral: అమెజాన్‌లో ఉద్యోగం మానేసి క్యాబ్ డ్రైవర్‌గా.. నెట్టింట మహిళా టెక్కీ పోస్ట్ వైరల్

Viral: కుటుంబ బాధ్యతలు, సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతో చాలామంది తమకు ఇష్టమైన ప్యాషన్‌ను వదిలేస్తుంటారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం.

Ravi
By Ravi
Published on: 16 Jun 2026 4:47 PM IST
Viral
X

Viral: అమెజాన్‌లో ఉద్యోగం మానేసి క్యాబ్ డ్రైవర్‌గా.. నెట్టింట మహిళా టెక్కీ పోస్ట్ వైరల్

Viral: సాధారణంగా ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వస్తే జీవితం స్థిరపడిపోయిందని సంతోషిస్తుంటారు. కానీ, ఆ ఉద్యోగం కంటే తనకు ఇష్టమైన ప్యాషన్‌ను ఫాలో అవ్వడమే నిజమైన సంతోషమని నిరూపించాడు హైదరాబాద్‌కు చెందిన కుమార్. బాధ్యతల పేరుతో ప్యాషన్ వదిలేయకుండా క్యాబ్ నడుపుతూ ఆయన ఎంతగానో ఆనందిస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన కుమార్ గతంలో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ అమెజాన్‌లో ఉద్యోగం చేసేవాడు. కానీ, డ్రైవింగ్ చేయడం అంటే అతనికి విపరీతమైన ఇష్టం. ఆ ప్యాషన్ కోసం ఏమాత్రం ఆలోచించకుండా 2014లోనే అమెజాన్‌లో తన జాబ్ మానేసి, పూర్తిస్థాయి క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. క్యాబ్ డ్రైవర్‌గా మారినప్పటి నుంచి ఇప్పటివరకు తను ఏకంగా 23,600 ట్రిప్పులు విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు కుమార్ చెబుతున్నాడు.

ఒక కార్పొరేట్ ఆఫీసులో నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడం కంటే, ఇలా క్యాబ్ నడుపుతూ తన సొంత నగరమైన హైదరాబాద్‌ను రోజూ ఎక్స్‌ప్లోర్ చేయడం తనకెంతో ఇష్టమని కుమార్ చెబుతున్నాడు. అంతేకాకుండా, ప్రతిరోజూ కొత్త వ్యక్తులను కలవడం, వారితో మాట్లాడటం, వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవడం తనకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని ఆయన వివరించాడు.

ఇటీవల కుమార్ క్యాబ్‌లో ప్రయాణించిన ఓ మహిళా టెకీ, అతని మాటలకు, అతని ప్యాషన్‌కు ఎంతో ముచ్చటపడింది. మన దేశంలో బాధ్యతల కోసం ప్యాషన్‌ను వదులుకునే వారున్న ఈ రోజుల్లో, ఇలా ప్యాషన్ కోసం జాబ్ వదిలేసి సంతోషంగా బతుకుతున్న ఇతని కథ ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.


Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story