Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం - ప్రైవేట్ స్కూల్‌లో మంటలు
Hyderabad: హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో కిడ్స్ స్కూల్‌లో భారీ అగ్నిప్రమాదం. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, హైడ్రా అధికారులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జాఫర్ హుసైన్.
Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం - ప్రైవేట్ స్కూల్‌లో మంటలు
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐ.ఎస్.సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ వాటర్ ట్యాంక్ రోడ్‌లో ఉన్న రెండు అంతస్థుల ప్రైవేట్ కిడ్స్ స్కూల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మొదటి అంతస్తులో కిడ్స్ స్కూల్, రెండో అంతస్తులో ఇల్లు ఉండటంతో స్థానికులు భవనాన్ని ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న ఐ.ఎస్.సదన్ పోలీసులు, రెండు ఫైర్ ఇంజన్లు, హైడ్రా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో ఉన్న వ్యక్తులను బయటికి తీసిన స్థానికులు, సంఘటనా స్థలానికి యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుసైన్ మిరాజ్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.




