Hyderabad: కాళేశ్వరం ఖర్చుపై ఎంజీఆర్ కౌంటర్
Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.89 వేల కోట్లేనని ఉత్తమ్ చెప్పారని, లక్ష కోట్ల ప్రచారం అబద్ధమని ఖైరతాబాద్ బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు.
Hyderabad: కాళేశ్వరం ఖర్చుపై ఎంజీఆర్ కౌంటర్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ.89 వేల కోట్లు మాత్రమేనని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అంగీకరించారని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు అన్నారు.
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారని తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలే సమాధానమని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలను వినాలని, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. లక్షల కోట్ల రూపాయల ఖర్చు అంటూ కేసీఆర్ గారిపై బురదజల్లడం మానుకోవాలని మండిపడ్డారు.
నేడు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో కీలకంగా నిలుస్తోందని, సుమారు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో ఈ ప్రాజెక్టు ముఖ్యపాత్ర పోషిస్తోందని MGR గారు పేర్కొన్నారు.




