Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో మినీ సిలిండర్ పేలుడు.. ఒకరికి గాయాలు

Hyderabad: హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్‌బన్ మోచీ కాలనీలో మినీ సిలిండర్ పేలి బీహార్‌కు చెందిన వ్యక్తికి గాయాలు. ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 7 Nov 2026 9:31 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో మినీ సిలిండర్ పేలుడు.. ఒకరికి గాయాలు

హైదరాబాద్: కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్‌బన్, మోచీ కాలనీలో ఒక ఇంట్లో 5 కేజీల మినీ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ మినీ సిలిండర్ పేలుడులో గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న కాలాపత్తర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాలాపత్తర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY