Hyderabad: కాప్రాలో ఘనంగా ఎన్వీ భాస్కరరావు సంస్మరణ సభ!

Hyderabad: హైదరాబాద్ నగర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ ఎన్వీ భాస్కరరావు 42వ వర్ధంతి సంస్మరణ సభ కాప్రా సర్కిల్ కమలానగర్ సీఐటీయూ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 24 Oct 2026 6:01 PM IST
Hyderabad
X

Hyderabad: కాప్రాలో ఘనంగా ఎన్వీ భాస్కరరావు సంస్మరణ సభ!

హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మేడ్చల్ మల్కాజిగిరి ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ పరిధిలోని కమలానగర్ సిఐటియు ఆఫీస్ ప్రాంగణంలో హైదరాబాద్ నగర ఉద్యమ నిర్మాత కామ్రేడ్ ఎన్ వి భాస్కరరావు 42వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు సభకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కాప్రా సర్కిల్ కార్యదర్శి కామ్రేడ్ జి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.

కామ్రేడ్ ఎన్ వి భాస్కర్ రావు చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు గొడుగు యాదగిరిరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జే చంద్రశేఖర్, కోమటి రవి లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ కామ్రేడ్ ఎన్ వి భాస్కరరావు బాల్యంలోనే కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితుడయ్యారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో కామ్రేడ్ సుందరయ్య కి కొరియర్ గా పనిచేశారు. నక్సలైట్ ఉద్యమం చీలిపోయిన తర్వాత హైదరాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేయడానికి కామ్రేడ్ ఎన్ వి భాస్కరరావు ని నియమించడం జరిగింది. ఆనాడు కామ్రేడ్ లక్ష్మి దాసు, ఎంకే స్వామి లాంటి వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారు.

అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రీకరించి పార్టీని బలోపేతం చేయటంలో నిర్విరామ కృషి చేశారు. ప్రతి కార్యకర్తతో వ్యక్తిగత సంబంధం కలిగి వారి బాగోగులను పరామర్శించి ఉద్యమ నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది అని అన్నారు. వ్యక్తిగతంగా నాక్కూడా ఆయన అభిమానం అవసరమైనప్పుడు కుటుంబం సమస్యలు పరిష్కరించడంలో ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ప్రజాశక్తి పేపరు హైదరాబాదు నలుమూలలకు వెళ్లే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు అని అన్నారు.

వారి క్రమశిక్షణ పట్టుదల కార్యకర్తలతో ఆయన అనుబంధం ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కోరారు. జె చంద్రశేఖర్ మాట్లాడుతూ కామ్రేడ్ ఎన్ వి భాస్కరరావు పట్టుదలగా ఉద్యమాన్ని నిర్మించాలని అప్పటివరకు హేళన చేసిన సిపిఐ వారికి తన ఆచరణ ద్వారా ఉద్యమాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సమాధానం చెప్పారని చెప్పారు. కోమటి రవి మాట్లాడుతూ కామ్రేడ్ ఎన్ వి భాస్కరరావు దృడ దీక్ష ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన విషయం అని చెప్పారు.

నేడు నవ తెలంగాణ పత్రిక పెంపు కార్యక్రమం జరుగుతున్నది. ఆనాడు ఎన్ వి భాస్కర్ రావు ఏదైతే పట్టుదలగా పత్రిక పెంపుదలకు కృషి చేశారో మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నవ తెలంగాణ పెంపుదల కృషి చేయాలని చెప్పారు. అంతేకాకుండా బిజెపి అప్రజాస్వామికంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓట్లను తొలగించడం తద్వారా అన్ని చోట్ల విజయం సాధించడం కనిపిస్తున్నది. దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలలో పనిచేయడం ద్వారా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారమవుతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జగ్గరాజు, సిహెచ్ ప్రసాద్, శ్రీమన్నారాయణ, దేవి రెడ్డి,గణేష్, సత్యనారాయణ, సిహెచ్ లీలావతి, శారద, శోభ, గౌస్య, ఎం శ్రీనివాసరావు, బంగారు ఆచార్యులు, కెవిపిఎస్ రమేష్, జి శివరామకృష్ణ, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA