Hyderabad: ఉన్నత విద్యలో ఏఐ విప్లవం గూగుల్ ఆఫీస్‌లో ‘నెక్స్ట్ 1.0’ సదస్సు
Hyderabad: క్యాంప్‌ఎక్స్ ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో గూగుల్ హైదరాబాద్‌లో ‘నెక్స్ట్ 1.0’ సదస్సు. ఉన్నత విద్యలో ఏఐ వినియోగం, పరిశ్రమల అవసరాలపై విద్యావేత్తల సుదీర్ఘ చర్చ.
Hyderabad: ఉన్నత విద్యలో ఏఐ విప్లవం గూగుల్ ఆఫీస్‌లో ‘నెక్స్ట్ 1.0’ సదస్సు
హైదరాబాద్: ఉన్నత విద్యలో ఏఐ వినియోగంతో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ‘నెక్స్ట్ 1.0’ సదస్సు నిర్వహించారు.
క్యాంప్‌ఎక్స్ ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని గూగుల్ హైదరాబాద్ కార్యాలయంలో జరిగిన ఈ సదస్సులో తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు వైస్ ఛాన్సలర్లు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ సహా ఆధునిక సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. పరీక్షల నిర్వహణ, డిజిటల్ మూల్యాంకనం, బోధన, క్యాంపస్ పరిపాలనలో ఏఐ వినియోగంపై సదస్సులో చర్చించారు.




