Hyderabad: తెలంగాణలో భారీగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు

Hyderabad: హైదరాబాద్‌లో నోవా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సంతానోత్పత్తి రేటుపై ప్యానెల్ చర్చ. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణుల వెల్లడి.

RAJESH,	WEST ZONE
Published on: 4 Aug 2026 4:04 PM IST
Hyderabad
X

Hyderabad: తెలంగాణలో భారీగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన "బియాండ్ ఐవీఎఫ్: బిల్డింగ్ ట్రస్ట్, ఎథిక్స్ అండ్ అవేర్నెస్ ఇన్ ART" ప్యానెల్ చర్చలో తెలంగాణలో మొత్తం సంతానోత్పత్తి రేటు ప్రతి మహిళకు దాదాపు 1.5 పిల్లలకు పడిపోయిందని, ఇది ఫర్టిలిటీ స్థాయి 2.1 కంటే చాలా తక్కువని నిపుణులు వెల్లడించారు.

ఏఆర్టీ చట్టం–2021పై అవగాహన, రిజిస్టర్డ్ ఫెర్టిలిటీ క్లినిక్‌ల ఎంపిక, రోగుల హక్కులు, నైతిక ప్రమాణాలు, ప్రజా విశ్వాసాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని, ఫెర్టిలిటీని ప్రజారోగ్య చర్చల్లో కీలక అంశంగా చూడాల్సిన అవసరం ఉందని ప్యానెలిస్టులు పేర్కొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story