Hyderabad: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జంపాల రాజేష్!
Hyderabad: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Hyderabad: రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జంపాల రాజేష్!
హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ జంపాల రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.
ఎన్నికల సంఘం పనితీరుపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఓటు చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ ఆధారాలతో ప్రజల ముందుకు వచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండమల్ల వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఏ. గణేష్ యాదవ్, సతీష్, కాంగ్రెస్ నాయకులు సీహెచ్. రంజిత్ రెడ్డి, పరుశురాం, శోభన్ రెడ్డి, రాంబాబు, బచ్చన్న, కళ్యాణ్, వెంకటేష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.




