Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసీ యువతి శిరీష మృతిపై నిరసన

Hyderabad: ఆదివాసీ యువతి శిరీష మృతిపై ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు నిరసన తెలిపారు.

HARISH, TARNAKA
Published on: 31 Aug 2026 7:35 PM IST
Hyderabad
X

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసీ యువతి శిరీష మృతిపై నిరసన

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ... తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలానికి చెందిన ఆదివాసీ యువతి శిరీష మృతి చెందడంపై ఆదివాసీ విద్యార్థి ఫోరం నేతలు తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు.

శిరీష ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిరీష మృతి ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా, సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, తీవ్ర విషాదంలో మునిగిపోయిన శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఆదివాసీ సమాజం తరఫున పోరాటం కొనసాగిస్తామని, శిరీష కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆదివాసీ విద్యార్థి ఫోరం నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం శిరీష మృతికి కారణమైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ

కార్యక్రమంలో ప్రొఫెసర్లు కాశీమ్, నాగేశ్వరరావు, కొండ నాగేశ్వరరావు, బాలు నాయక్, ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మడావి అజయ్, గౌతమ్, శివ గణేష్, రాజశేఖర్, బండి శేకర్, భావన , శిరీష, కె. వినోద్, అజయ్, సొందే అన్సార్, తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story