Hayathnagar: నిండుకున్న ఇంధన నిల్వలు.. వాహనదారుల అవస్థలు

Hayathnagar: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్‌లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది.

AJAY, HAYATH NAGAR
Published on: 27 April 2026 2:39 PM IST
Hayathnagar
X

Hayathnagar: నిండుకున్న ఇంధన నిల్వలు.. వాహనదారుల అవస్థలు

హైదరాబాద్: నగర శివారు ప్రాంతాలైన హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ పరిసరాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు నిండుకోవడంతో యాజమాన్యాలు నో స్టాక్’ బోర్డులు ప్రదర్శిస్తున్నాయి.సోమవారం ఉదయం నుంచే హయత్ నగర్ జాతీయ రహదారి వెంబడి ఉన్న పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వారు బంకుల వద్దకు వచ్చి నిరాశతో వెనుతిరుగుతున్నారు. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర వెతికినా ఇంధనం దొరకని పరిస్థితి నెలకొంది. పెట్రోల్ నిల్వలు ఉన్న ఒకటి రెండు బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ నిల్వలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story