Hyderabad: కొత్త పోస్టల్ రీజియన్ల కోసం హైదరాబాద్‌ డాక్ సదన్‌లో నిరాహార దీక్ష

Hyderabad: తెలంగాణకు కొత్త పోస్టల్ రీజియన్లు, డివిజన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అబిడ్స్ డాక్ సదన్‌లో పోస్టల్ యూనియన్లు నిరాహార దీక్ష చేపట్టాయి.

GIRI, CENTRAL ZONE
Published on: 30 Oct 2026 4:59 PM IST
Hyderabad
X

Hyderabad: కొత్త పోస్టల్ రీజియన్ల కోసం హైదరాబాద్‌ డాక్ సదన్‌లో నిరాహార దీక్ష

హైదరాబాద్: తెలంగాణలో పోస్టల్ పరిపాలనా యూనిట్ల కోసం... అబిడ్స్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం, డాక్ సదన్ లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో పరిపాలనా అవసరాలకు అనుగుణంగా... కొత్త పోస్టల్ రీజియన్లు, పోస్టల్ డివిజన్లు ఏర్పాటు చేస్తున్న సమయంలో... తెలంగాణ సర్కిల్‌కు మాత్రం ఒక్క కొత్త పోస్టల్ రీజియన్, డివిజన్ కూడా ఏర్పాటు చేయకపోవడంపై సంఘం నాయకులు మండిపడ్డారు.

పైగా ఉన్న పరిపాలనా వ్యవస్థను కుదించే చర్యలు చేపట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జనాభా పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి... విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలు, గిరిజన, అటవీ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని... పోస్టల్ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తపాలా డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించి... తెలంగాణ సర్కిల్‌కు అవసరమైన కొత్త పరిపాలనా యూనిట్ల ప్రతిపాదనలను... తక్షణమే తపాలా డైరెక్టరేట్‌కు సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోస్టల్ శాఖ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన తపాలా సేవలు... సమర్థవంతమైన పరిపాలన, ఉద్యోగుల ప్రయోజనాల కోసం... ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బైట్: భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు.

1. వరంగల్ కేంద్రంగా నూతన పోస్టల్ రీజియన్‌ను ఏర్పాటు చేయాలి.

2. ఖమ్మం డివిజన్‌ను విభజించి భద్రాద్రి కొత్తగూడెం పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాలి.

3. ఆదిలాబాద్ డివిజన్‌ను విభజించి మంచిర్యాల పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాలి.

4. సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించి వికారాబాద్ పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాలి.

5. మెదక్ డివిజన్‌ను విభజించి సిద్దిపేట పోస్టల్ డివిజన్ ఏర్పాటు చేయాలి.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE