Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆస్తి ఆక్రమణపై రాజేందర్ జైన్ నిరసన

Hyderabad: జూబ్లీహిల్స్‌లో తన గెస్ట్‌హౌస్‌ను కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఆక్రమించుకున్నారంటూ రాజేందర్ జైన్ ఆందోళన. అదుపులోకి తీసుకున్న పోలీసులు.

RAJESH,	WEST ZONE
Published on: 17 Aug 2026 4:30 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఆస్తి ఆక్రమణపై రాజేందర్ జైన్ నిరసన

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లోని తన ఆస్తిని కాంగ్రెస్ నేత డాక్టర్ రోహిన్ రెడ్డి ఆక్రమించుకున్నారని, అంతేకాకుండా తప్పుడు కేసులతో తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాజేందర్ జైన్ ఆరోపించారు. తన భార్య పేరుతో కొనుగోలు చేసిన గెస్ట్‌హౌస్‌లో వివాదాన్ని పరిష్కరిస్తానని చెప్పి సుమారు పదేళ్ల క్రితం రోహిన్ రెడ్డి అద్దె పేరుతో దిగారని ఆయన పేర్కొన్నారు.

అయితే అద్దె చెల్లించకపోవడంతో పాటు, చివరకు ఇంటిని కూడా తమకు అప్పగించకుండా ఆక్రమించుకున్నారని రాజేందర్ జైన్ ఆరోపించారు. ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన జూబ్లీహిల్స్‌లోని గెస్ట్‌హౌస్ ఎదుట ఆందోళనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న రాజేందర్ జైన్‌ను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆస్తికి సంబంధించిన పత్రాలు, వివాదం వెనుక ఉన్న అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై డాక్టర్ రోహిన్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి వివరణ వెలువడాల్సి ఉంది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story