Hyderabad: హైదరాబాద్‌లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ బైక్స్!
Hyderabad: హైదరాబాద్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ 'ఫ్లయింగ్ ఫ్లీ' ఎలక్ట్రిక్ బైక్స్ ఎంట్రీ. ప్రత్యేక స్టోర్, మూడు సర్వీస్ కేంద్రాలు ప్రారంభం.
Hyderabad: హైదరాబాద్‌లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ ఈవీ బైక్స్!
Hyderabad: రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్రీ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. బెంగళూరులో వినియోగదారుల నుంచి వచ్చిన మంచి స్పందనతో దేశవ్యాప్తంగా విస్తరణ చేపడుతున్న సంస్థ.. హైదరాబాద్‌లో నాలుగు సేల్స్, సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎర్రగడ్డలో ప్రత్యేక స్టోర్‌తో పాటు మరో మూడు సర్వీస్ కేంద్రాల ద్వారా వినియోగదారులకు విక్రయాలు, సాంకేతిక సహాయం, నిర్వహణ సేవలు అందించనుంది.




