Saidabad: అంబరాన్నంటిన బోనాల సంబరాలు – వైభవంగా 'గంటల' ఊరేగింపు!
Saidabad: హైదరాబాద్ సైదాబాద్, మాదన్నపేటలో ఘనంగా బోనాల ఉత్సవాలు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలతో వైభవంగా సాగిన 'గంటల' ఊరేగింపు. భారీ బందోబస్తు.
Saidabad: అంబరాన్నంటిన బోనాల సంబరాలు – వైభవంగా 'గంటల' ఊరేగింపు!
Saidabad: హైదరాబాద్ సైదాబాద్‌లో బోనాల ఉత్సవాల్లో భాగంగా గంటల ఊరేగింపులు ఘనంగా కొనసాగాయి. సైదాబాద్, మాదన్నపేట, కుర్మగూడ ప్రాంతాల్లో జరిగిన ఈ ఊరేగింపుల్లో కళాకారుల నృత్యాలు, పోతురాజుల ఆటలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకలను తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సైదాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద పోతురాజులు, కళాకారులు, నిర్వాహకులను ఘనంగా సన్మానించారు.
Next Story




