Hyderabad: బషీర్‌బాగ్‌లో ఆన్‌లైన్‌లో వసూళ్లకు పాల్పడిన హోంగార్డుపై కేసు!
Hyderabad: హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసిన హోంగార్డు ప్రసాదరావుపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు. దర్యాప్తు చేపట్టిన అధికారులు.
Hyderabad: బషీర్‌బాగ్‌లో ఆన్‌లైన్‌లో వసూళ్లకు పాల్పడిన హోంగార్డుపై కేసు!
Hyderabad: బషీర్‌బాగ్‌లో ఓ వ్యక్తి నుంచి రూ.300 ఆన్‌లైన్‌లో వసూలు చేసిన హోంగార్డు పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పార్సిగుట్టకు చెందిన యశ్వంత్ (20) జూన్ 11న బంధువుల బర్త్‌డే వేడుకకు వెళ్లి హిల్‌ఫోర్ట్ రోడ్డులో బైక్ నిలిపాడు. అక్కడికి వచ్చిన సైఫాబాద్ పీఎస్ లో పనిచేస్తున్న హోంగార్డు ప్రసాదరావు రోడ్డుపై వాహనం నిలిపినందుకు కేసు నమోదు చేస్తానని బెదిరించి రూ.వెయ్యి డిమాండ్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరకు క్యూఆర్ కోడ్ ద్వారా రూ.300 చెల్లించగా వాహన తాళాలు తిరిగి ఇచ్చాడని తెలిపాడు. దీనితో బాధితుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు , దర్యాప్తు చేస్తున్నారు.




