Hyderabad: కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఎంకు సెక్యూరిటీ అసోసియేషన్ విజ్ఞప్తి
Hyderabad: కనీస వేతన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ సిబ్బందిని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి చేసింది.
Hyderabad: కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఎంకు సెక్యూరిటీ అసోసియేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్: వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర సంస్థలలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, హౌస్ కీపింగ్ సిబ్బందికి న్యాయం జరిగేలా కనీస వేతన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ డి జాదవ్, వైస్ చైర్మన్ మురారి గౌడ్ మాట్లాడారు. చట్టం సక్రమంగా అమలు కాకపోవడంతో సుమారు 8 లక్షల మంది పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికులకు న్యాయం చేసే చట్టాన్ని పక్కన పెట్టి ఇబ్బందికరంగా ఉన్న పసరా చట్టాన్ని అమలు చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదని అన్నారు.
రోజుకు 12 గంటలకు పైగా పని చేసే సెక్యూరిటీ ఇతర సిబ్బందికి వేతనాల విషయంలో ఉదాసీనంగా ఉంటున్న ప్రభుత్వ శాఖలు వారికి ఇబ్బందికరంగా ఉన్న చట్టాలను అమలు చేయాలని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కార్మికుల కష్టాలు, గుర్తింపు లేని ఏజెన్సీల దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకుగాను సంబంధిత శాఖలకు, ప్రధాన ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని కోరారు.




