Hyderabad: ఈనెల 31న పీపుల్స్ ప్లాజాలో ‘సైనథాన్ 3.0’ అవగాహన రన్!

Hyderabad: ఈ నెల 31న హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆశ్రయ్ ఆకృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘సైనథాన్ 3.0’ అవగాహన రన్. జెర్సీ, పోస్టర్ ఆవిష్కరణ.

RAJESH,	WEST ZONE
Published on: 28 Oct 2026 12:21 PM IST
Hyderabad
X

Hyderabad: ఈనెల 31న పీపుల్స్ ప్లాజాలో ‘సైనథాన్ 3.0’ అవగాహన రన్!

Hyderabad: సైనథాన్ అనేది కేవలం పరుగు మాత్రమే కాదని, వినికిడి లోపం ఉన్న వారి సమస్యలు, హక్కుల కోసం సమాజానికి వినిపించే గొప్ప ప్రయత్నమని, 'సైగ చేద్దాం.. మద్దతు ఇద్దాం ..శక్తినిద్దాం'అనే నినాదంతో సాగుతుందని క్వాల్ కమ్ సీనియర్ డైరెక్టర్ నితినశర్మ, స్టేట్ స్ట్రీట్ ఏవీపీ నీతూ చద్దా అన్నారు.

శ్రీనగర్ కాలనీలో ఆశ్రయ్ ఆకృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31న పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న అవగాహన రన్ సైనథాన్ 3.0కు సంబంధించిన జెర్సీ, గుడీ బ్యాగ్స్, పోస్టర్ను ఆశ్రయ్ ఆకృతి సంస్థ డైరెక్టర్ డీపీకే బాబుతో కలిసి ఆవిష్కరించారు.

వినికిడి లోపం ఉన్నవారి కోసం వారి లాంగ్వేజ్ (ఇండియన్ సైన్ లాంగ్వేజ్)పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ రన్ను ఏర్పాటుచేస్తున్నామని, వినికిడి లోపం ఉన్నవారి ఆత్మగౌరవం పెంచేలా చేయడా నికి సైనథాన్ను నిర్వహిస్తున్నామని సంస్థ డైరెక్టర్ డీపీకే బాబు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE