Hyderabad: ఎక్సైజ్ శాఖపై అవినీతి ఆరోపణలు తగవు
Hyderabad: ఎక్సైజ్ శాఖ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయడం, ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేయడం తగదని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఖండించారు.
Hyderabad: ఎక్సైజ్ శాఖపై అవినీతి ఆరోపణలు తగవు
హైదరాబాద్: జేఏసీల ముసుగులో కొంతమంది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని,మంత్రులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేయడం, ఏసిబికి ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి బెదిరింపులను సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతామని టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఏలూరి శ్రీనివాస్‌రావు అన్నారు.
బుధవారం టీఎన్జీవో భవన్లో ఎక్సైజ్ యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. కొందరు ఎక్సైజ్ శాఖపై, ఆ శాఖలో పనిచేసే అధికారులపై కొందరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని తాము వారి మాదిరిగా మాట్లాడలేమని టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఏలూరి శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.
ఎక్సైజ్ శాఖ యూనిఫాం సర్వీసులో ఉందని, ఈ శాఖలో పనిచేసే వారు క్రమ శిక్షణతో పనిచేస్తారని అలాంటి వారిపై కొందరు బయటివ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దానివల్ల ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని, రాజకీయ నాయకుల మాదిరిగా, ట్రేడ్ యూనియన్ లీడర్ల మాదిరిగా తాము మాట్లాడలేమని టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఏలూరి శ్రీనివాస్ తెలిపారు.
ఎక్సైజ్ శాఖలో జరిగిన బదిలీలు, పదోన్నతులపై కొందరు వరుసగా సోషల్‌మీడియాలో పెడుతున్న వీడియో, పోస్టులపై టిజిఓ ఎక్సైజ్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. టిజిఓ ఎక్సైజ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ నాంపల్లిలోని టిజిఓ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం మాట్లాడారు.
ఈ సమావేశంలో టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ఎంబి కృష్ణయాదవ్, గండూరి వెంకట్, రామారావు, శిరీష, వినోద్, భీంసింగ్, టిజిఓ ఎక్సైజ్ శాఖ అధికారులు చంద్రశేఖర్, విజయ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేయడం తగదు
ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పదేళ్ల నుంచి ఎక్సైజ్ శాఖలో బదిలీలు లేవని, 2024, 2026 సాధారణ బదిలీల్లోనూ ఎక్సైజ్ శాఖలో బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదని అయినా ప్రభుత్వంతో చర్చించి బదిలీలు, పదోన్నతులు ఇప్పించామని ప్రస్తుతం జరిగిన బదిలీల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని, ఒకవేళ జరిగినా విజిలెన్స్‌తో పాటు ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరుపుతుందని, ఈ అంశంపై బయటి వ్యక్తులు ఎలాంటి సంబంధం లేదని అయినా వారు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేయడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని జేఏసీల ముసుగులో కొంతమంది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, బెదిరించడం సరికాదన్నారు. మంత్రులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఐఏఎస్ అధికారులను టార్గెట్ చేయడం, ఏసిబికి ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను విమర్శించడాన్ని గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరపు ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.
ఉద్యోగుల కోసమే కాదు, రాజకీయ నాయకులు, ప్రైవేటు జెఎసిలు, సంఘాలపై కూడా ఎసిబి నజర్ ఉండాలని ఆయన సూచించారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌పై పని కట్టుకొని కొందరు దుష్ఫచారం చేస్తున్నారని లక్ష్మణ్ గౌడ్
ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ అన్నారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ మీద కొందరు పని కట్టుకొని దుష్ఫచారం చేయడాన్ని ఖండిస్తున్నామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.
రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే అతిపెద్ద శాఖలో ఎక్సైజ్ శాఖ ఒకటని, యూనిఫాం సర్వీసులకు అన్ని శాఖలతో పాటు బదిలీలు ఉండవని, ఎక్సైజ్ శాఖలో బదిలీలు లేక ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతుంటే ఎక్సైజ్ కమిషనర్ మీద తాము ఒత్తిడి తెచ్చి బదిలీలు చేయించామని ఆయన తెలిపారు.
ఎక్సైజ్ శాఖ బదిలీల్లో అవినీతి జరిగిందని కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారని బయటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ ఉద్యోగుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయద్దని ఆయన సూచించారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో జరిగిన కొన్ని సంఘటనలపై కమిషనర్ చర్యలు తీసుకోలేదని బయటి వ్యక్తులు ఆరోపణలు చేయడం తగదని ఆయన తెలిపారు.




