Hyderabad: జంట నగరాల్లో మెడికల్ షాపులు సంపూర్ణ బంద్

Hyderabad: ఆన్‌లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో 24 గంటల మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది.

RAJESH,	WEST ZONE
Published on: 20 May 2026 5:39 PM IST
Hyderabad
X

Hyderabad: జంట నగరాల్లో మెడికల్ షాపులు సంపూర్ణ బంద్

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా బంద్ లో భాగంగా జంట నగరాల్లో ను మెడికల్ షాప్ లు మూసివేశారు.24 గంటల బంద్ కు దుకాణదారులు పిలుపునిచ్చారు.దీంతో ఉదయం నుంచే జంటనగరాల్లో మెడికల్ షాప్ లు మూతపడ్డాయి.కాగా ఆన్ లైన్ లో మందుల విక్రయం వల్ల తాము నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్జిస్ట్ సంఘం హైదరాబాద్ నేతలు సమావేశమయ్యారు.నగరంలో మెడికల్ షాపుల బంద్ జరుగుతుందని ఎక్కడ కూడా షాపులు తెరిచి లేవన్నారు.కాగా అసోసియేషన్ రాష్ట్ర ఉప అధ్యక్షుడు శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ మెడికల్ షాపులు మూసివేశామన్నారు.

మరో మెడికల్ యజమాని మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమేనన్నారు.అయితే ప్రభుత్వం ఆన్లైన్ మందుల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల తాము నష్టపోతున్నామని చెప్పారు. కాగా మెడికల్ షాపుల బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో ఈ అంశంపై చర్చించారు.ఎక్కడ అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story