Uppal: ఉప్పల్‌లో వెండి గొలుసు చోరీ కేసు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

Uppal: ఉప్పల్ బస్ స్టాప్‌లో నిద్రిస్తున్న క్యాబ్ డ్రైవర్ మెడలోని వెండి గొలుసును లాక్కెళ్లిన ముగ్గురు యువకులను ఉప్పల్ పోలీసులు, సీసీఎస్ బృందం అరెస్టు చేసింది.

KARUNAKAR, UPPAL
Published on: 27 Aug 2026 11:56 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్‌లో వెండి గొలుసు చోరీ కేసు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

ఉప్పల్‌: బస్‌స్టాప్‌లో నిద్రిస్తున్న వ్యక్తి మెడలోని వెండి గొలుసును లాక్కెళ్లిన ముగ్గురు యువకులను ఉప్పల్‌ పోలీసులు, సీసీఎస్‌ బృందం అరెస్టు చేసింది. వారి నుంచి రూ.55 వేల విలువైన వెండి గొలుసు, నేరానికి ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాప్రా సత్యనారాయణపురం కాలనీకి చెందిన రాచకొండ శ్రీనివాస్‌చారి (31) క్యాబ్‌ డ్రైవర్‌. ఈ నెల 24న నాగోల్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై జూపిటర్‌ స్కూటర్‌పై తిరిగి వస్తూ ఉప్పల్‌ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల బస్‌స్టాప్‌ వద్ద ఆగాడు.

తెల్లవారుజామున 2 గంటల సమయంలో అక్కడ నిద్రిస్తుండగా గ్లామర్‌ బైక్‌పై వచ్చిన ముగ్గురు అతడి మెడలోని సుమారు మూడు తులాల వెండి గొలుసును బలవంతంగా లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో 26న ఉప్పల్‌ రాజ్యలక్ష్మి థియేటర్‌ వద్ద బనాల కార్తీక్‌కుమార్‌ (19), నంపల్లి శివ (19)ను అరెస్టు చేశారు. 27న ఉప్పల్‌ స్టేడియం మెట్రో వద్ద కందలకోయ గణేశ్‌ (19)ను అదుపులోకి తీసుకున్నారు.

చెడు అలవాట్లకు బానిసలై..

ముగ్గురూ చిన్ననాటి స్నేహితులని, చెడు అలవాట్లకు బానిసలై డబ్బుల కొరతతో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు కార్తీక్‌పై గతంలోనూ చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, విశ్వసనీయ సమాచారంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story