Osmania University: ఫీజు బకాయిలు విడుదల చేయాలి విద్యార్థి జన సమితి
Osmania University: పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన విద్యార్థి జన సమితి.
Osmania University: ఫీజు బకాయిలు విడుదల చేయాలి విద్యార్థి జన సమితి
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి జన సమితి నాయకులు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజుల కోసం కళాశాలల ఒత్తిడి కారణంగా విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతింటోందని పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు చెరుకు శివరాజ్, విద్యార్థి జన సమితి కార్యదర్శి మాలోత్ రవి కుమార్ మాట్లాడుతూ, బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు విద్యార్థులు పరీక్షలు రాయడం, సర్టిఫికెట్లు పొందడం, ఉన్నత విద్య కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అత్యవసరంగా పెండింగ్ బకాయిలను విడుదల చేసి, అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మంద మిట్టు, మంద నీలేష్, మంద మణిందర్, బోడ వెంకట్, తాళ్లపెళ్లి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.




