Hyderabad: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన యువ నాయకులు
Hyderabad: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన యువ నాయకులు. పార్టీ బలోపేతం, యువత పాత్రపై ఆత్మీయ చర్చ.
Hyderabad: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన యువ నాయకులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుల సమక్షంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)గారితో వడ్డె రమేష్ వెంకటేష్ మొగులయ్య మధు గారికి పరిచయం జరిగింది.
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి చొరవతో ఈ పరిచయం జరిగింది. ఈ సందర్భంగా వడ్డె రమేష్‌ను KTR గారికి పరిచయం చేయగా, ఆయనతో ఆప్యాయంగా మాట్లాడి పార్టీ కార్యక్రమాలు, యువత పాత్ర, సోషల్ మీడియా ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా KTR గారు తనదైన శైలిలో చమత్కారమైన మాటలతో అందరినీ నవ్విస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. KTR గారితో జరిగిన ఈ ఆత్మీయ పరిచయం వడ్డె రమేష్ వెంకటేష్ మధు మొగులయ్య కు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.
బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కోసం యువతను సమన్వయం చేస్తూ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.




