Hyderabad: మాజీ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి అన్నప్రసాద వితరణ!

Hyderabad: హైదరాబాద్ కప్రా టీజీఐఐసీ కాలనీలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు మరియు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 20 Sept 2026 10:21 AM IST
Hyderabad
X

Hyderabad: మాజీ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి అన్నప్రసాద వితరణ!

Hyderabad: ఏఎస్‌ రావునగర్ డివిజన్ పరిధిలోని టీజీఐఐసీ కాలనీలో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుని సన్నిధిలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఉత్సవాల సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గణనాథుని దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులకు యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త నాగ ఫణీంద్ర, యువసేన యూత్ అసోసియేషన్ చైర్మన్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల్లో ఐక్యత, సోదరభావం, సేవా దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు భక్తుల కోసం అన్నప్రసాద వితరణ వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులు, స్థానికులు, నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యువసేన యూత్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానికులు, మహిళలు, యువత, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA